Crores transferred from Gulf nations to Tablighi Jamaat Leaders accounts
దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడానికి కారణమైన ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికీ దాని తాలూకూ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. దీంతో నిజాముద్దీన్ లో సమావేశం పెట్టి దేశంలో కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమయ్యారని పోలీసులు సాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే సాద్ కి నాలుగుసార్లు నోటీసు ఇచ్చారు. అయినా ఇంకా హాజరుకాని పరిస్థితి నెలకొంది. ఈనేపధ్యంలో సాగిస్తున్న ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లీగ్ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాదిరూపాయల నిధులు వచ్చాయని తేలిందట.
నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ తోపాటు అతని సన్నిహితుల ఖాతాల్లోకి గల్ఫ్ దేశాల నుంచి నిధులు వచ్చాయని తేలింద ని అంటున్నారు. జమాత్ చీఫ్ మౌలానా సాద్, అతని సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన కోట్లాదిరూపాయల నగదు వివరాలను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సమాచారం అందించారు. మౌలానా సాద్ తోపాటు అతని ముగ్గురు కుమారులు, మేనల్లుడి ఖాతాల్లోకి గల్ఫ్ డబ్బు వచ్చిందని టాక్.
ఇటీవల ఢిల్లీ క్రైంబ్రాంచ్పోలీసులు సాద్ ఫాంహౌస్ పై దాడి చేసినపుడు రూ.2కోట్ల అంతర్జాతీయ నిధులతో ఆస్తులు కొన్నట్లు డాక్యుమెంట్లు లభించాయి. మర్కజ్ కు విదేశాల నుంచి హవాలా మార్గంలో నిధులు వచ్చాయా? మనీలాండరింగ్ కు పాల్పడ్డారా అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. మొత్తంమీద తబ్లీగ్ జమాత్ చీఫ్ కు విదేశీ నిధుల రాకపై పోలీసులు ఇచ్చిన నివేదికతో ఈడీ అధికారులు సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ కొత్తకోణం వెలుగు చూడ్డంతో సంచలనం రేపింది.