Sunday, February 28, 2021

Latest Posts

అమరావతి రైతుల నోట విశాఖ – కరోనా కలకలం

Crucial decision on shifting capital to Visakhapatnam

అమరావతి రాజధానిని తరలించొద్దని, పాలనంతా అమరావతి నుంచే సాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు కరోనా కాలంలోనూ కొనసాగుతున్నాయి. అయితే సామాజిక దూరం పాటించాలన్న నిబంధనకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఇళ్లల్లోనే దీక్షలు చేస్తున్నారు.  బుధవారానికి 120వ రోజు   తుళ్లూరు, పెదపరిమి, వెలగపూడి, రాయపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ, అనంతవరం, నెక్కల్లు, మందడం, ఉద్దండరాయునిపాలెం, నేలపాడు, దొండపాడు గ్రామాల్లో రైతులు, మహిళలు ఇళ్లు, వీధుల్లో కూర్చొని ‘జై అమరావతి, సేవ్‌ అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనలు చేశారు. ’అమరావతి వెలుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కరోనా కేసులు తగ్గించి చూపిస్తున్నారని ఆరోపించారు.

‘వైజాగ్‌లో కరోనా వ్యాప్తి ఆగిపోయిందని ప్రభుత్వం దొంగ లెక్కలు చెప్తోంది.. మాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి. గుంటూరులో కరోనా ప్రభావం ఉందని, వైజాగ్‌ సేఫ్‌ జోన్‌ అని చెప్పటానికి అక్కడ పరీక్షలు కూడా నిర్వహించటం లేదు’ అని మహిళా జేఏసీ నేత రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్ చేసారు.  గుంటూరులోని తన నివాసంలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నేత మల్లికార్జునరావుతో కలిసి రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావం తెలుపుతూ 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కుట్రలతో స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చిన రైతులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బహిరంగంగా ర్యాలీలు నిర్వహిస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా ఇంట్లో కూర్చొని నిరసనలు చేస్తున్న రైతులపై ఎందుకు కేసులు పెట్టకూడదని పోలీసులు నోటీసులు ఇవ్వటం ఏమిటని నిలదీశారు. ఇటువంటి బెదిరింపులకు బయపడేది లేదని కరోనా ముసుగులో రాజధాని తరలించాలనుకుంటే సహించేది లేదని శైలజ తీవ్రంగా  హెచ్చరించారు. కాగా ఏపీలో కేసులు తగ్గించి చూపిస్తున్నారని ఇప్పటికే టిడిపి ఆరోపించడంతో పాటు కేసులు దాచిపెడితే రాష్ట్రం నష్టపోతుందని హెచ్చరించింది.‘దాచిపెడితే వచ్చే సమస్యలకు నెల్లూరు, కర్నూలు వైద్యుల ఉదంతాలే ఉదాహరణ. రాష్ట్రంలో వైసీపీ నేతలు కరోనా పరీక్షలపై అబద్ధాలు చెబుతున్నారు. అందువల్లే అది విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజే 44 కేసులు నమోదయ్యాయి. నిక్కచ్చిగా చర్యలు తీసుకుంటే అవి పెరిగేవి కాదు. దీనిని తేలిగ్గా తీసుకోవద్దు’ అని ప్రభుత్వానికి టిడిపి అధినేత చంద్రబాబు సూచించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss