Thursday, January 21, 2021

Latest Posts

కరోనా ఎఫెక్ట్ : రాజస్థాన్ లో కర్వ్యూ

curfew in rajasthan due to 3-yr-old test positive for coronavirus:

అల్లర్లు అలజడులు జరిగినప్పుడే కర్వ్యూ విధించడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అది కరోనాకు మారింది. కరోనా మహమ్మారి నుంచి కాపాడ్డానికి దేశంలో వివిధ ప్రాంతాల్లో విస్తృత చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్ లోని ఓ కుటుంబంలో ముగ్గురు సభ్యులకు కొవిడ్ -19 సోకడంతో అప్రమత్తమైన సర్కారు రోగులున్న ఇంటికి కిలోమీటరు దూరం కర్ఫ్యూ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజుహును జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో ముగ్గురికి కొవిడ్ -19 సోకింది.

దీంతో ముగ్గురు కరోనా రోగులను జైపూర్ నగరంలోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ గదులకు తరలించారు.ముగ్గురు కరోనా రోగులున్న ఇంటికి కిలోమీటరు దూరం కర్ఫ్యూ విధిస్తూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సీఆర్‌పీసీ 144 సెక్షన్ ను విధిస్తూ రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్ణయం తీసుకున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం అశోక్ గెహ్లాట్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మార్చి 31 వతేదీ వరకు 144 సెక్షన్ ను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని గ్రంథాలయాలను సైతం మూసివేయాలని రాజస్థాన్ సర్కారు నిర్ణయించింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss