cyber criminals cheating with today special offer in E Commerce sites
లాక్ డౌన్ సమయంలోనకిలీ గాళ్లు కొన్ని సంస్థల లోగో, డిజైన్‌ను వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. టుడే స్పెషల్ ఆఫర్ పేరుతో వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ పేరుతో ఇంటర్నెట్లో నకిలీ వెబ్ సైట్ వెలసింది. దీని ఆధారంగా వివిధ ఆఫర్ల పేరుతో ప్రచారం చేసుకుంటున్న అందినకాడికి దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఏకంగా 90 నుంచి 95 శాతం డిస్కౌంట్ అంటూ ఎర వేస్తున్నారు, తగ్గించి విక్రయిస్తున్నామంటూ ప్రొడక్ట్ ల ఫొటోలతో సహా వెబ్ సైట్ లో పెడుతున్నారు. ఈ సైట్‌ను నమ్మి మోసపోయిన ఓ వ్యక్తి బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.
నకిలీ వెబ్ సైట్ లో అనేక ఖరీదైన ఫోన్లు 90 నుంచి 95 శాతం వరకు తగ్గించి విక్రయిస్తున్నానట్లు, ఫోన్ల ఫొటోలతో సహా డిస్ ప్లే కూడా ఉండటంతో కొందరు ఆ సైట్లోనే ఫోన్లు బుక్ చేసి, ఆన్ లైన్ లోనే పేమెంట్ చేస్తున్నారు. బుక్ చేసిన ఫోన్లు రాకపోగా ఆరా తీశారు, దాంతో మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్ర ఇంచినట్లు తెలుస్తుంది. ఇదే తరహాలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 2900 రూపాయలుతో ఒక ప్రోడక్ట్ బుక్ చేసి ఎంతకూ అది డెలివరీ రాకపోవడంతో బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మోసాలు లాక్ డౌన్ సమయంలో పెరిగి పోయాయని పోలీసులు అంటున్నారు. ప్రజలు అంతా అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు.