Sunday, June 20, 2021

Latest Posts

జెర్సీ, చావు కబురు చల్లగా సినిమాని వాడేస్తున్న పోలీసు వారు

Cyberabad Police Troll

సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసు వారు అవేర్‌నెస్ కోసం సోషల్ మీడియా ని ఎంతగా యూస్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజలు చేయాల్సిన ప్రతీ పనిని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తారు. అంతే కాదు వారు సమాజంలో జరుగుతున్న ప్రతీ దాని పై స్పందిస్తూ చాలా యాక్టివ్ గా ఉంటారు.

తాజాగా జరిగిన జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ లో భాగంగా జెర్సీ రెండు అవార్డులను సాధించింది. ఇప్పుడు జెర్సీ టీంని విష్ చేస్తూనే జెర్సీ మూవీని అవేర్‌నెస్ కోసం వాడుకున్నారు. ఇందులో క్రికెటర్‌గా దర్శనమిచ్చిన నాని ఫీల్డ్‌లో బ్యాట్‌ పట్టుకుని ముఖాన హెల్మెట్‌ పట్టుకుని ఏ ఫోరో, సిక్సరో బాదడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుండగా మరో ఫొటోలో హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్నాడు.

ఇది చూసిన అతడి కొడుకు గౌతమ్‌.. “నువ్వు హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుంటావ్‌ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న” అని సలహా ఇస్తున్నట్లుగా ఉంది. కాగా పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఎవరైనా మీమర్‌కు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ ఇచ్చారా సర్‌? అని కొందరు ఫన్నీగా అడుగుతున్నారు.

ఇదిలా వుంటే ఇటీవలే చావు కబురు చల్లగా పోస్టర్‌ను కూడా ఫుల్‌గా వాడుకున్నారు పోలీసులు. హెల్మెట్‌ పెట్టుకోండి బస్తీ బాలరాజు గారూ.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం లేదు.. అని మీమ్‌ షేర్‌ చేశారు.

Cyberabad Police Troll

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss