Home వైరల్ నేడు రాష్ట్రానికి అంపన్ తుఫాన్

నేడు రాష్ట్రానికి అంపన్ తుఫాన్

cyclone amphan

ఆగ్నేయ బంగాళా ఖాతంలో  దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం తర్వాత వాయుగుండంగా మరి శనివారం సాయంత్రనికి అంపన్‌ తుఫానుగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణంగా 1000 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని దిఘాకు నైరుతిగా 1,160 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేరపురాకు వాయువ్యంగా 1,220 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను ప్రభావంతో మే 18 సాయంత్రం నుంచి ఒడిశా తీరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మే 19, 20 న  భారీ నుంచి అతిభారీ వర్షాలు, కురవనున్నాయి.

అంపన్‌తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని శనివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాలలో ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో కొంతమేర పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు  తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు, పడే అవకాశం ఉందని అలాగే నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు. కానీ  ఎంఫాను తుఫాను ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాల్లో పెద్దగా ప్రభావమ్ చూపకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version