Cyclone Burevi Effect on AP
నివర్ తుఫాన్ చేసిన బీభత్సం మరచిపోకముందే మరో తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం (డిసెంబర్ 2) సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని కారణంగా బుధవారం, గురువారం కేరళతో పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 55-65 వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ తీరం వైపు తరలివస్తున్న సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఐఎండీ అధికారులు తెలిపారు. మత్స్యకారులెవరూ బంగాళఖాతంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: