రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్యను షోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం చేశారు. తాజాగా ఆయన ట్విట్టర్లో తన కాబోయే భార్యతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి ‘ఆమె ఒప్పుకుంది’ అని తెలిపారు. ఇప్పటికే రానా ప్రేమ వ్యవహారం పై ఎన్నో వార్తలు వచ్చాయి. వారిలో హీరోయిన్ల పేరు కూడా రానా పెళ్లి చేసుకునే వారి జాబితా లోనికి వచ్చి నట్లు వినిపించింది. వాటి అన్నిటికి ఫుల్స్టాప్ పెడుతూ రానా తన మనసులో ఉన్న అమ్మాయి ఫొటో షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎన్నోఏండ్లుగా తన ప్రేమాయణంపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాడు. సోషల్‌మీడియా ద్వారా రానా తను వివాహం చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశాడు. తన ప్రేమను మిహికా బజాజ్ అంగీకరించిందని చెప్పాడు. ఈ సందర్భంగా తన ప్రేయసితో ఉన్న ఫొటోను రానా అభిమానులతో పంచుకున్నాడు. డ్యూ డ్రాప్ డిజైన్ అనే ఈవెంట్ కంపెనీని మిహికా రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి ఆమెతో రానా ప్రేమ ప్రయాణం సాగిస్తున్నట్లు తెలిసింది. సహచర నటీనటులు, డైరెక్టర్లు, సన్నిహితులు, అభిమానులు రానాకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
And she said Yes 🙂 ❤️ pic.twitter.com/iu1GZxhTeN
— Rana Daggubati (@RanaDaggubati) May 12, 2020
ఇది కూడా చదవండి: అబ్బాయి అయితే చాలు అంటున్న రకుల్ ప్రీత్ సింగ్