రజినీకాంత్ సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ గడ గడలాడుతుంది. అలాంటిది సంక్రాంతి సమయం లో వస్తే ఇక ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అదే ఊపులో
ఎ.ఆర్.మురుగదాస్ ‘రజనీకాంత్, నయనతార, నివేదా థామస్,సునీల్ శెట్టి నటించిన’ దర్బార్ ‘ఈ రోజు తెలుగు, తమిళం, హిందీ, మలయాళాలలో థియేటర్ పైకి వచ్చింది. మరి ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ లో చూసేద్దాం.
కధ:
ఇక మొదటగా కథలోకి వస్తే ముంబై పోలీసు కమిషనర్ ఆదిత్య అరుణాచలం అలియాస్ రజనీకాంత్ కాల్పుల కేసులో, తెలియని కారణాల వల్ల ఒకే రోజులో అనేక మంది గ్యాంగ్స్టర్లను చంపారు. అతను ఇప్పటికే పంజాబ్లో మాదకద్రవ్యాల కేసును నిర్వహించడం వల్ల గౌరవాన్ని కోల్పోయి ముంబై నుండి డిల్లీకి ట్రాన్సఫర్ అవుతారు. ఇదే సమయం లో ఒక వ్యాపారవేత్త కుమారుడు అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్), నగరంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం మరియు ,మైనర్ బాలికలను అక్రమంగా రవాణా చేయడం వంటి వాటికి పేరుగాంచాడు.
అయితే వీటిని అదుపు చేయడం కోసం అరుణాచలం మళ్ళీ సునిల్ శెట్టి తో చేతులు కలిపాడా అసలేం జరిగింది అనేది మీరు థియేటర్ లో చూడవలిసిందే.
నటినటులు విశ్లేషణ:
ఇక నటీ నటుల విషయానికి వస్తే రజినీకాంత్ తన పవర్ఫుల్ యాక్షన్తోకట్టిపడేశారు. నివేదా థామస్తో రజినీకాంత్ సీన్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. ఇక నయనతార, రజినీ జంట వెండితెరపై చూడముచ్చటగా ఉంది. ఇక ఏ ఆర్ మురుగ దాస్ సినిమా నిఒక్క సెకన్ కూడా బోర్ అనేది కొట్టకుండా తెరకెక్కించారని చెప్పవచ్చు. అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఇంకా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ రజినీని చాలా అందంగా, కలర్ఫుల్గా చూపించడం లో 100కి 100 మార్కులు వచ్చాయని చెప్పవచ్చు.
ప్రస్తుతానికి వస్తోన్న టాక్ బట్టి చూస్తే ఈ సినిమా సూపర్ హిట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో రజినీ ఇంట్రడక్షన్ సీన్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు . మొత్తంగా చూస్తే మళ్లీ అలనాటి రజినీని చూశామని తలైవా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
మూవీ రేటింగ్ : 3.5 / 5