Monday, April 19, 2021

Latest Posts

దర్శక ధీరుడు దాసరి నారాయణ రావు

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శ‌కత్వం దాసరి నారా‌య‌ణ‌రావు ఈ టైటిల్‌ కార్డు ఒక్కటి చాలు.‌ ఓ సిని‌మాకి సంబం‌ధిం‌చిన ఏయే రంగాల్లో, ఏయే విభా‌గాల్లో, ఏయే శాఖలను దాసరి ఎలా ప్రభా‌వితం చేశారో అని చెప్పటానికి. పోస్ట‌రుపై హీరో బొమ్మ, హీరో‌యిన్‌ అందాలు, టైటిల్‌ తప్ప ఇంకేం కని‌పిం‌చని రోజుల్లో అవి. దాసరి నారా‌య‌ణ‌రావు అంటూ సూ‌రీ‌డల్లే వెలు‌గు‌లీ‌ను‌తున్న అక్ష‌రాల్ని ముద్రిం‌చు‌కొని, ‌సిని‌మాకి కెప్టెన్‌ అంటే దర్శకుడు అని నమ్మి.‌.‌ అదే మాటలు సినీ జనాలూ నమ్మేలా చేసి, దర్శ‌కుడ్ని అందలం ఎక్కిం‌చిన ఘనత దాస‌రికే దక్కింది.

తెలుగు చిత్రసీ‌మపై దాసరి ప్రభావం అంతా ఇంతా కాదు.‌ మరీ ముఖ్యంగా దర్శ‌కత్వ విభా‌గంలో..దాసరి జోరు, దాసరి ఆలో‌చ‌నలు, సిని‌మాని దాసరి నడి‌పిం‌చిన తీరు.. ఇప్ప‌టికీ నిత్య పారా‌య‌ణాలు గానే చెప్పుకుంటారు.‌ అందుకే దర్శ‌కుల పాలిట ఆది గురు‌వుగా మారాడు దాసరి.‌ అందుకే తెలుగు సినిమాని దాసరికి ముందు…దాసరి తరువాత అని చెప్పుకుంటారు. పరిశ్రమ పెద్ద దిక్కు దర్శకరత్న డా.దాసరి నారాయణరావు 2017లో స్వర్గస్తులైన సంగతి మనకు తెలిసిందే.

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో దాసరి నారాయణరావు స్థానం సుస్థిరం. పాలకొల్లులో జన్మించి మద్రాసు పరిశ్రమలో గొప్ప కీర్తిని ఘడించిన దర్శకుడాయన. నాడు సూపర్ స్టార్లు అందరితో పని చేసిన ఘనత ఆయనకే సొంతం. అసలు అభిమాన సంఘాలు అంటే కేవలం హీరోలు.. హీరోయిన్లకు మాత్రమేనని అనుకునేవారంతా. అలాంటి టైమ్ లో దర్శకులకు కూడా అభిమాన సంఘాలు ఉంటాయి అని నిరూపించింది దాసరిగారే. మూడు దశాబ్ధాల క్రితమే ఆయన కోసం దర్శకసంఘాలు ప్రారంభమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మే 4, 1942లో జన్మించిన దాసరి తాతా మనుమడు సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటీనటులకు హిట్ చిత్రాలనందించిన దాసరి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఇవాల్టి తరం వారికి ఆయన తెలియకపోవచ్చు కానీ…దాసరి నారాయణరావు పేరు తెరపై కనిపించగానే ఈలలు, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయేవి. అసలు పోస్టర్లపై మేఘం ఆకారంలో కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం దాసరి నారాయణరావు అంటూ జనం థియేటర్ల వైపు క్యూలు కట్టేవారు.

అంతేనా దర్శకుడిగా 140 సినిమాలు తీయడమంటే మామూలు విషయం కాదు. అందుకే అత్యధిక సినిమాలు తీసినందుకు దర్శకుడిగా గిన్నెస్ రికార్డులోకి ఎక్కారాయన. 53 సినిమాలు నిర్మాణం.. మాటల రచయితగా, పాటల రచయితగా 250కి పైగా చిత్రాలకు పనిచేశారు. రెండు జాతీయ అవార్డులు, తొమ్మిది సార్లు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు ఆయన్ని వరించాయంటే అది అతిశయోక్తి కాదు. అలా ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్కరి చేత గురువు గా పిలిపించుకొన్నారు.

కష్టమొస్తే మా గురువు గారు ఉన్నారు అని సినీ ఇండస్ట్రీలోని ప్రతి వ్యక్తి ఆయన గడపనే తొక్కేవారు. అలా ప్రతి ఒక్కరి బాధలను తీర్చే వారు. అందరికీ నేనున్నానంటూ ఆత్మ బంధువు అయ్యాడు. తనకంటూ ఒక చెరగని గుర్తింపు పెనవేసుకొని అందరి మనసులో ఓ చెరగని ముద్రవేసుకున్నాడు. అలా ఈ భూవిపై తాను చేసేది ఏమీ లేదంటూ..ఇక తాను వచ్చిన పని అయిపోయిందంటూ అందరకూ తుది వీడ్కోలు చెబుతూ దివికేగారు. అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం దాసరి పేరు, ఆయన రూపం ప్రేక్షకాభిమానుల గుండెల్లో చెక్కు చెదరదు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss