కర్ణాటక శివమొగ్గలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాజేశ్వరి(64) అనే మహిళ ఆమె కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు ఆమె వృత్తి రీత్యా రిటైర్డ్ టీచర్, అయితే క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె మే 13న మోతాదుకు మించి మెడిసిన్ తీసుకోవడంతో సదరు మహిళ వెంటనే ప్రాణాలు కోల్పోగా దానితో ఆమె కూతురు తల్లి మరణం తట్టుకోలేక ఆమె పక్కనే అలానే ఉండిపోయింది. తల్లిని విడిచి ఉండలేక చనిపోయిన తన తల్లి శవంతో ఐదు రోజులు గడిపింది ఆ కూతురు.
ఇది కూడా చదవండి:హైదరాబాద్లో మొదలైన హడావిడి
అయితే ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగువారు వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోనికివెళ్లి చూసేసరికి కుళ్లిన తల్లి శవం పక్కన కూతుర్ని చూసి షాకయ్యారు అక్కడ ఉన్నవారాంత. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సమాచారం తెలుసుకున్నా పోలీసులు రాజేశ్వరి భౌతిక కాయాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేశారు. తల్లి శవంతోనే ఐదు రోజుల పాటు గడిపిన కూతురు మానసిక స్థితిపై అనుమానంతో ఆస్పత్రిలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: యువతులపై లైంగిక దాడి చేసిన వాచ్ మెన్