Home వైరల్ మహేశ్ బాబు డైలాగ్ తో దుమ్ము రేపిన డేవిడ్ వార్నర్

మహేశ్ బాబు డైలాగ్ తో దుమ్ము రేపిన డేవిడ్ వార్నర్

David Warner amazing tik tok videso on Telugu movies

ఈ లాక్డౌన్ సమయంలో తన అభిమానులను అలరించడానికి డేవిడ్ వార్నర్ తన టిక్ టోక్ వీడియోను పంచుకోవడం ద్వారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇండియన్ మూవీస్ పై ఎక్కువగా కాన్సంట్రేట్ చేసిన వార్నర్ అండ్ ఫ్యామిలి, తరచుగా ఇండియన్ మూవీలలో పాటలు, సీన్ ల టిక్ టాక్ చేస్తూ తన అభిమానులతో పాటు, ఇండియన్ క్రికెట్ ఫాన్స్ కు కూడా వినోదాన్ని పంచుతున్నాడు. కాగా తనను భారతీయ అభిమానులు టిక్ టాక్ వీడియొలను ఇండియన్ సినిమాల పై చెయ్యమని అడగగా వారి కోరిక మేరకు తరచుగా తాను ఈ వీడియొలు చేస్తూ తన అభిమానుల విన్నపాన్ని నెరవేరుస్తున్నాడు.

కాగా అలా చేసిన వీడియొలలో అల్లు అర్జున్ మూవీ రీసెంట్ బ్లాక్ బస్టర్ “అలా వైకుంటపురములో” మూవీ లో బుట్ట బొమ్మ సాంగ్ ని టిక్ టాక్ చేశాడు. ఆ వీడియొలో తన భార్య తో పాటు అచ్చం అల్లు అర్జున్ లాగా  చెప్పులేశాడు. ఈ వీడియొలో తన కూతురు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కాగా ఇప్పుడు వార్నర్ మహేశ్ బాబు సినిమా పోకిరి లో ఒక పంచ్ డైలాగ్ ను టిక్ టాక్ చేశాడు.  ఇది ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. “ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను” అనే డైలాగ్ ను అదే రేంజ్ లో చెప్పి మెస్మరైజ్ చేశాడు.

ఇది కూడా చదవండి: మహేశ్ బాబుకి వీరాభిమానిని అంటున్న రవిచంద్రన్ అశ్విన్

 

Exit mobile version