Monday, May 10, 2021

Latest Posts

వరంగల్ బావిలో మృత దేహాలు

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని పారిశ్రామిక ప్రాంతం వద్ద ఉన్నటుండి విషాదఛాయలు అలుముకున్నాయి. గొర్రెకుంట గ్రామంలో నివాస ముంటున్న నలుగురు వలస కూలీలు బావిలో మృతదేహాలుగా తేలియాడుతూ కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలనికి చేరుకున్నారు. చనిపోయిన వారు ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా  హత్య చేశారా అనే అంశాలపై పోలీసులు లోతుగా పరిశోధన చేస్తున్నారు. అయితే అక్కడ  లభించిన మృతదేహాలు ఎం.డీ.మక్సూద్‌ ఆలం(50), ఎం.డీ.నిషా ఆలం(45) దంపతులు, కూతురు బుష్రా ఖాతూన్‌(20), మనమడు(3) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకున్నా వారి మృతి వెనుక ఆర్థిక ఇబ్బందులు కాకుండా మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు.

వీరు పశ్చిమ బెంగాల్‌ నుంచి పొట్టకూటి కోసం ఇక్కడకు వచ్చి దాదాపు ఇరవై ఏళ్లుగా వరంగల్‌ కరీమాబాద్‌లో నివాసముంటూ చినిగిన బస్తా సంచులు(బార్‌దాన్‌) కుడుతూ పొట్ట పోసుకుంటున్నారు. దంపతులతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉండేవారు అని గ్రామస్తులు తెలిపారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిచేసే చోటకు మకాం మార్చిన ఆ కుటుంబంలోని నలుగురు బావిలో మృతదేహాలుగా తేలారు అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.మృతుడు మ క్సూద్‌ ఆలం తో పాటు కుమారుడు సోయల్‌ ఆలం,షాబాజ్‌ ఆ లంతో పాటు మరోఇద్దరు బీహారీ కార్మికుల ఆ చూకీ కోసం పోలీస్‌ బృందాలతో గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా నలుగురు బావిలో శవాలై తేలిన కేసు విషయంలోపూర్తి సమాచారం అందాల్సి ఉందని డీసీపీ వెంకటలక్ష్మి రాత్రి విలేకరులకు తెలిపారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss