Death cases in coronavirus in nizamuddin religious meet:
తెలుగు రాష్ట్రాల్లో కొత్త కలకలం రేగింది. ఢిల్లీ లోని మతపరమైన పాల్గొని వచ్చినవారు మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గుండెలు అదిరే ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం చేసింది. దాని ప్రకారం తాజాగా సోమవారం కరోనా కారణంగా ఆరుగురు మరణించినట్లుగా ప్రకటించింది. మరణించిన ఆరుగురిలో నలుగురు ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లుగా తేల్చారు. ఆ నలుగురి నుంచి సోకిన మరో ఇద్దరు మరణించటంతో..సోమవారం ఒక్కరోజే చోటు చేసుకున్న మొత్తం మరణాలు ఆరుకు చేరుకున్నాయి. ఇక కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే అన్న విషయాన్ని గుర్తించారు.ఇలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారెవరు? అనంతరం వారితో కాంటాక్ట్ అయిన వారెందరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇంతకాలం కరోనా వ్యాప్తి చెయిన్ ను నిలువరించామన్న ధీమాతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా ఊహించని షాకిచ్చిందని చెప్పాలి. దీంతో.. ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. అదే సమయంలో.. ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. వారికి ఉచితంగా వైద్యం చేస్తామని.. అనవసరమైన సంకోచాలు పెట్టుకోవద్దని చెప్పారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారు 280 మంది వరకూ ఉన్నారని.. వారిలో 186 మంది ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. వాళ్లలో ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. నలుగురు మరణించారు. మరో వ్యక్తి నిజామాబాద్ కాగా.. ఇంకొకరు గద్వాల్ కు చెందినోళ్లు.
ఏపీ నుంచి ఢిల్లీ మత సమావేశాలకు ఏ జిల్లా నుంచి ఎంతమంది వెళ్లారని దానిపై ఆరా తీశారు.
విజయనగరం నుంచి ముగ్గురు, విశాఖపట్నం రూరల్ నుంచి ఒకరు, విశాఖపట్నం 41, తూర్పుగోదావరి 27, పశ్చిమగోదావరి 16, కృష్ణా 16, విజయవాడ 27, గుంటూరు అర్బన్ 45, గుంటూరు రూరల్ 43, ప్రకాశం 67, నెల్లూరు 68, కర్నూల్ 189, కడప 59, అనంతపురం 73, చిత్తూరు 20, తిరుపతి 16మంది ఢిల్లీ వెళ్లారని ప్రాధమిక అంచనా. వీళ్లంతా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తుండగా, వీళ్ళలో చాలామంది ఢిల్లీ నుంచి వచ్చాక చాలాచోట్ల ట్రావెల్ చేయడంతో ట్రాన్స్ మిషన్ లా వ్యాపించే ప్రమాదాన్ని పసిగట్టి,చర్యలు చేపడుతున్నారు.