death cases in usa,spain,italy every half an hour through corona
కరోనా మహమ్మారి వేలాది ప్రాణాలను కబళిస్తోంది. అమెరికా లాంటి అగ్ర రాజ్యమే కరోనాతో తల్లడిల్లిపోతోంది కొన్ని దేశాల్లో గుట్టగుట్టలుగా శవాలు దర్శన మిస్తోంది. స్పెయిన్ లో కరోనా వైరస్ కారణంగా రోజువారీ సగటు మరణాల సంఖ్య మంగళవారం 743 కు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం కరోనా కారణంగా దేశంలో 14,045 మంది మరణించారు.
కాగా స్పెయిన్ లో ఎక్కడ చూసినా శవాలు కనిపిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద స్మశానవాటిక అయిన మాడ్రిడ్‌లోని లా అల్ముడెనాలో ప్రతి 15 నిమిషాలకు ఒక మృతదేహం దహనమవుతోంది. ఈ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 5 మందికి మించి అనుమతించడంలేదు. ఇటలీ తరువాత కరోనా వైరస్ కారణంగా అత్యధికులు ప్రాణాలు కోల్పోయిన రెండవ దేశం స్పెయిన్. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో సుమారు 5 వేల మంది మరణించారు. ఇక్కడ మార్చి 14 నుండి ప్రారంభమైన లాక్డౌన్ ఇప్పుడు రెండవసారి ఏప్రిల్ 26 వరకు పొడిగించారు.
కాగా వరుసగా వారంపాటు కొత్తకేసులు నమోదు కాకపోవడంతో ఇరాన్ పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్పీకర్ సహా సభలో అత్యధికులకు కరోనా పాజిటివ్ తేలడంతో పార్లమెంటును ఉన్నపళంగా మూసేసారు. డెన్మార్క్ ఈ నెల 15 నుంచి పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. ఇప్పుడికప్పుడే కరోనా తీవ్రతను చవిచూస్తున్న శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. కరోనా పరీక్షలు, నిర్ధారణ, చికిత్సకు అత్యవసరమైన వైద్య పరికరాలు, రక్షణ సామగ్రి, మాస్కులను అందించింది. దాదాపు పది టన్నుల పరికరాలను ప్రత్యేక విమానంలో లంకకు పంపించింది.