Tuesday, March 2, 2021

Latest Posts

నడిరోడ్డు మీద కరోనా లక్షణాలతో వృద్ధుడు మరణం

Death of an elderly man with corona symptoms on the nipple

కరోనా లక్షణాలతో నేపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు హైదరాబాద్‌లో నడి రోడ్డుపై ప్రాణాలు కోల్పోయాడు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న బహదూర్ అనే వ్యక్తి గాంధీ హాస్పిటల్‌కు వెళ్ళగా అక్కడ పేషెంట్లు ఎక్కువగా ఉండటం, బెడ్లు ఖాళీ లేకపోవడంతో అతడ్ని కింగ్ కోఠీ హాస్పిటల్‌కు వెళ్లమని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో అతడు కింగ్ కోఠీ హాస్పిటల్‌కు వెళ్లగా కరోనా లక్షణాలు ఉన్నాయని, హాస్పిటల్‌లో చేర్చుకోలేమని, అంబులెన్స్ లో గాంధీ హాస్పటల్ కు పమిస్తామని చేశారు.

కానీ ఎంతకూ అంబులెన్స్ రాకపోవడంతో నడుచుకుంటూ గాంధీ హాస్పిటల్‌కు తిరిగి ప్రయాణం అయ్యాడు. కానీ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని శాంతి థియేటర్ వద్ద కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై అటుగా వెళ్తున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం దగ్గర కింగ్ కోఠీ హాస్పిటల్ పత్రాలు ఉండటాన్ని గమనించారు.

పోలీసులు కింగ్ కోఠీ హాస్పిటల్ వెళ్లి అరా తీయగా జరిగినది తెలుసుకున్నారు. అతను నేపాల్‌కు చెందిన 70 ఏళ్ల బహదూర్ అని  లాలాపేటలోని ఓ బార్‌లో పని చేసేవాడు అని పోలీసుల తెలిపారు.  జలుబు, దగ్గు కారణంగా చనిపోవడం వల్ల వైద్య సిబ్బంది మృతదేహం నుంచి శాంపిళ్లను సేకరించిన పరీక్షలకు పంపారు. కరోనా పాజిటివ్ అని తేలితే మున్సిపల్ సిబ్బందే అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss