Thursday, December 2, 2021

Latest Posts

రాహుల్ గాంధీ ట్వీట్ ని తొలగించిన ట్విట్టర్

Delete Rahul Gandhi’s photo of Dalit girl’s family

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్‌ చేసిన ఒక ట్వీట్‌ని ట్విట్టర్ ఇండియా తొలగించింది. రాహుల్ గాంధీ ఢిల్లీలో అత్యాచారం మరియు హత్య కేసు బాధితురాలి తల్లిదండ్రులను కలిసిన ఫోటోను ట్విట్టర్ లో ట్వీట్‌ చేయగా ఆ ట్వీట్‌ని ట్విట్టర్ ఇండియా తొలగించింది. రాహుల్ గాంధీ షేర్ చేసిన ఫోటోలో బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు కనిపిస్తుండటంతో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌కు నోటీసులు జారీచేసింది.

ఆ నోటిసులో మైనర్ బాధితుల కుటుంబ ఫోటోను పోస్ట్ చేయడం జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సెక్షన్ 74 మరియు బాల లైంగిక నిరోధం సెక్షన్ 23 కింద నేరం. నేరాల చట్టం (POCSO) ఉల్లంఘన కూడా అని తెలిపింది. ముఖ్యంగా అత్యాచార బాధితురాలి ఫోటోను, వారి ఐడెంటిటీని బహిర్గతం చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని కమిషన్ స్పష్టంచేసింది. ఆ నోటీసుకు స్పందించిన ట్విట్టర్ ఇండియా రూల్స్ కు వ్యతిరేకంగా పోస్ట్ ఉన్నందున ట్వీట్‌ను తొలిగిస్తున్నట్లుగా రాహుల్ గాంధీకి నోటిఫికేషన్ ద్వారా సమాచారం ఇచ్చి ట్వీట్‍ను తొలిగించింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss