శనివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (58 బంతుల్లో 101 నాటౌట్ 14 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీ చేయడంతో ఢిల్లీ తన జైత్రయాత్ర కొనసాగించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ పరాజయంతో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఇది కూడా చదవండి: