Tuesday, April 13, 2021

Latest Posts

ఇల్లు మారిపోయిన జమాత్ చీఫ్ – హవాలా డబ్బుపై ఆరా 

Delhi Crime Branch police have repeatedly issued notices to Tabliq Jamaat chief

నిజాముద్దీన్ మర్కజ్ లో మౌలానా సాద్ జమాత్ సమావేశం నిర్వహించి దేశంలో కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమయ్యాడని అతనిపై 304 హత్యా నేరంతోపాటు పలు సెక్షన్ల కింద ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.  ఇన్నాళ్లు హోం క్వారంటైన్‌లో ఉన్న మౌలానా సాద్‌కు ఒక ప్రైవేటు ల్యాబ్ లో కరోనా వైరస్ పరీక్ష చేయగా నెగిటివ్ అని వచ్చింది.  అంతకుముందు  పోలీసుల దర్యాప్తునకు రావాలని కోరుతూ తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు పలుసార్లు నోటీసులు జారీ చేసినా ఆయన రాలేదు. దేశంలో 1000మందికి పైగా తబ్లీగ్ జమాత్ సభ్యులకు కరోనా పాజిటివ్ రాగా, పలువురు సభ్యులు మరణించారు.

అయితే  మౌలానా సాద్ కు కరోనా లేదని పరీక్షల్లో తేలినా ఆయన పోలీసుల ముందు హాజరు కాలేదు. తాజాగా  మౌలానా సాద్ ఉన్న ఇంటి నుంచి మరో ఇంటికి మారారని ఢిల్లీ పోలీసులకు సమాచారం వచ్చింది. గతంలో సాద్ హోంక్వారంటైన్ లో ఉండటంతో పోలీసులు అతన్ని ప్రశ్నించలేక పోయారు. గతంలో ఐసోలేషన్ లో ఉన్న కాలంలోనే మౌలానా సాద్ కొన్ని పోలీసుల ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానాలిచ్చారు. హోంక్వారంటైన్ ముగిసి మౌలానాకు కరోనా లేదని తేలడంతో అతన్ని ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. మౌలానా సాద్, మరో 18మంది జమాత్ నేతలతోసహా 2వేల మంది సభ్యులు దేశం విడిచి వెళ్లకుండా ఢిల్లీ పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.

కాగా    తబ్లీగ్ జమాత్‌కు పలు దేశాల నుంచి పెద్దఎత్తున డబ్బు హవాలా ద్వార వచ్చిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అనుమానిస్తున్నారు. తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంథ్వాల్వీతోపాటు పలువురు జమాత్ ముఖ్యనేతలపై ఈడీ అధికారులు హవాలా డబ్బు బాగోతంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద జమాత్ చీఫ్ సాద్ తోపాటు పలువురిపై కేసులు నమోదు చేసిన ఈడీ గురువారం దర్యాప్తు ప్రారంభించింది.దేశంలోని నిజాముద్దీన్ మర్కజ్ లో సమావేశం ఏర్పాటు చేయడం ద్వార కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమైన మౌలానా సాద్ తోపాటు అతని ముగ్గురు కుమారులపై కూడా ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss