Delhi Nizamuddin incident Tabligh Jamaat members move to jail
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమైన ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిన సంగతి తెల్సిందే. అప్పటినుంచే కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈ సమావేశానికి వచ్చి వీసా నిబంధనలను ఉల్లంఘించి మసీదులో దాక్కున్న 10 మంది ఇండోనేషియా వాసులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ నగరంలో వెలుగుచూసింది.
ధన్బాద్ మసీదులో ఇండోనేషియా దేశానికి చెందిన 10 మంది తబ్లీగ్ జమాత్ సభ్యులున్నారని అందిన సమాచారంతో పోలీసులు వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. 14 రోజుల పాటు క్వారంటైన్ ముగిశాక వారిని వీసా నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005ను ఉల్లంఘించిన నేరాలపై 10మంది ఇండోనేషియా వాసులను అరెస్టు చేశామని ధన్బాద్ పోలీసు అధికారి సురేంద్ర సింగ్ చెప్పారు.
అరెస్ట్ చేసిన వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఆదివారం ధన్బాద్ జిల్లా జైలుకు తరలిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ జమాత్ సమావేశం అనంతరం వారు ధన్బాద్ వచ్చి గోవింద్ పూర్ మసీదులో దాక్కున్నారని పోలీసులు చెప్పారు. జంషడ్ పూర్ నగరంలోనూ మరో 11 మంది ఇండోనేషియా దేశానికి చెందిన తబ్లీగ్ జమాత్ కార్యకర్తలను పోలీసులు జైలుకు పంపించారు