Sunday, June 13, 2021

Latest Posts

విద్యార్థిని బెల్ట్ తో కొట్టిన పోలీస్‌ పై నడి రోడ్డులో దాడి

Delhi Student Attacked Police
దేశంలో పోలీసులు అంటే భయం లేకుండా పోతుంది. ఏకంగా వారినే కొట్టే స్థితికి వచ్చారు సామాన్యులు. అయితే మేము పోలీసు కదా ఏదైనా చేయవచ్చు అనుకునే వారికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఢిల్లీలో ఏప్రిల్‌ 5వ తేదీన జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ. నడి రోడ్డు మీద ఒక విద్యార్థిపై బెల్ట్‌ తో పోలీసు దాడి చేయడంతో పోలీసు వారికి దానికి తగిన బుద్ది చెప్పారు విధ్యార్ధులు. ఏదైనా తప్పు ఉన్నా నడి రోడ్డు మీద అలా బెల్ట్‌ తో కొట్టడం ఏంటంటూ వారు తిరగబడ్డారు.

ఇక సంఘటన వివరాల్లోకి వెళితే గీతేష్‌ దాగర్‌ అనే 20 ఏళ్ల కుర్రాడు కారులో వస్తూ ఉండగా పోలీసులు ఆపడంతో వెంటనే సడెన్‌ బ్రేక్‌ వేశాడు. దాంతో వెనుక నుండి వస్తున్న మరో వాహనం‌ అతడిని ఢీ కొట్టింది. దాంతో పోలీసుల వద్దకు వెళ్లిన గీతేష్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఈ చెకింగ్‌ ఏంటంటూ పోలీసులను ప్రశ్నించాడు. మమ్మలనే ప్రశ్నిస్తావా అంటూ పోలీసు అధికారి అతడిపై బెల్ట్‌ తో దాడికి దిగాడు. ఇక అంతే నడి రోడ్డు పై బెల్టుతో దాడి చేస్తారా అంటూ పోలీసు వారి పై తిరగబడ్డారు అక్కడ ఉన్న విధ్యార్దులు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss