Tuesday, April 13, 2021

Latest Posts

ఇన్స్టాగ్రామ్ ద్వారా గాంగ్ రేప్ కు ప్లాన్ చేసిన స్టూడెంట్స్

Delhi Students Planned to Gang Rape

ఢిల్లీలోని నాలుగైదు ఫేమస్ స్కూళ్లల్లో చదువుతున్న 22 మందికిపైగా స్టూడెంట్లు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో ‘బాయ్స్ లాకర్ రూం’ పేరిట ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ‘బాయ్స్ లాకర్ రూం’ గ్రూప్​లోకి ఈ మధ్య ఓ అబ్బాయిని చేర్చుకున్నారు. అతడు తనకు తెలిసిన అమ్మాయికి చాటింగ్ స్క్రీన్ షాట్లను పంపాడు. అయితే అందులో తన ఫొటోలు కూడా ఉండటంతో ఆ అమ్మాయి స్కూలులో కంప్లయింట్ చేసింది. దీంతో స్కూల్ అడ్మినిస్ర్టేషన్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది.విషయం తెలుసుకున్న ఆ గ్రూపు సభ్యులు.. తమ వివరాలను వెల్లడించిన అమ్మాయి, ఆమెకు సహకరించిన ఇతర మహిళల నగ్న చిత్రాలు వైరల్‌‌‌‌‌‌‌‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు స్టూడెంట్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్​ను సీజ్ చేశారు. గ్రూప్​ను డీయాక్టివేట్ చేశారు.ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్​లో ఈ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. ‘బాయ్స్ లాకర్ రూమ్’ హాష్​ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆ గ్రూప్​లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss