Wednesday, December 1, 2021

Latest Posts

డిపాజిట్ల‌పై రూ. 5 ల‌క్ష‌ల భీమా ప్రకటించిన కేంద్రం

Deposit insurance bill amendments

డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేష‌న్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లను క్లియ‌ర్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది కేంద్రం. లాక్ డౌన్ వల్ల కుప్ప‌కూలిన‌ మరియు ఆర్ధిక మోసాల‌కు గురైన బ్యాంకు డిపాజిట‌ర్ల‌కు ఉప‌శమ‌నం క‌లిగించేందుకు డిపాజిట‌ర్ల‌కు వారి మొత్తం డిపాజిట్ల‌పై రూ. 5 ల‌క్ష‌ల భీమా క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  ఆర్థిక అవకతవకలు సహా ఇతర కారణాలతో ఆర్బీఐ మారటోరియం ఎదుర్కొంటున్న బ్యాంకుల్లోని డిపాజిట్‌ దారుల సొమ్ముకు భద్రత కల్పించేలా బుధవారం కేంద్ర కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి బ్యాంకుల్లోని డిపాజిట్‌దారులు 90 రోజుల్లో గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు తమ డబ్బును వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పించే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) చట్టం-1961 సవరణ బిల్లుకి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. బ్యాంకు డిపాజిటర్ల కష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి . ఈ పథకం ద్వారా 98.3 శాతం డిపాజిటర్లు లబ్ధి పొందుతారని ఈ సందర్బంగా తెలిపారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss