Sunday, May 16, 2021

Latest Posts

దేశంలో కొత్తగా కరోనా కేసులు

దేశంలో గత నాలుగురోజులుగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే కొత్తగా వచ్చిన కేసుల కంటే మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం కొంత ఊరట కలిగిస్తున్నది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 90,50,598కి చేరాయి. ఇందులో 84,78,124 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,39,747 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్నటి నుంచి ఇప్పటిదాకా 49,715 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఈ మహమ్మారి వల్ల మరో 564 మంది మృతిచెందారు. దీంతో కరోనా మరణాలు 1,32,726కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 93.67 శాతం కాగా మరణాల రేటు 1.47 శాతంగా ఉంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss