Thursday, May 13, 2021

Latest Posts

ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అన్న దేవి శ్రీ ప్రసాద్

Devi Sri Prasad says All should be fine for sure :

ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా మందుకు సాగడం అనే మార్గాన్ని ప్రస్తుత పరిస్థితి మనకు నేర్పిస్తుంది. కరోనా విషయం తెలిసిన తరువాత చాలా కంగారు పడ్డాము, కాగా ఎవ్వరు దీని బారిన పడకూడదని కోరుకున్నాను. మన దేశంలోనే ఇతర రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది, ఈ కరోనా మహమ్మారి నుండి త్వరగా ప్రపంచం బయట పడాలని అనుకుంటున్నాను అని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. తను విదేశాలకు అల్లు అర్జున్, సుకుమార్ కలిసి రూపొందించబోయే సినిమా కోసం విదేశాలకు వెళ్లామని కానీ ఆ టైం కి ఈ కరోనా ఎక్కడ వ్యాప్తి చెందలేదని తెలిపారు. తనకు విదేశాలు మ్యూజిక్ ఫంక్షన్స్ కోసం, మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, వెళ్లిన ప్రతి దేశాలకు చెందిన వాయిద్యాలను నేను కొనుక్కుంటానని తెలిపారు. త్వరలో ఈ పరిస్థితి పూర్తిగా సద్దుమణుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తన మేనల్లుడు గురించి చెపుతూ తనకి కూడా మ్యూజిక్, డాన్స్ అంటే చాలా ఇంటరెస్ట్ అని, తనకి కూడా మేనమామ పోలికలు వచ్చాయని తెలిపారు. తన ఇంట్లోనే తన మ్యూజిక్ స్టూడియో ఉండడం వలన పెద్దగా కష్టంగా లేదని, తనకు క్వారంటైన్ పెద్ద కష్టంగా లేదని, నిత్యం తను ఇంట్లోనే ఉంటానని తెలిపారు. ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్న ఇంట్లో పనులు ఇప్పుడు చేసే అవకాశం దొరికిందని చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాగా త్వరలో మ్యూజిక్ మారథాన్ పేరు మీద మ్యూజికల్ ఫండ్ రైసింగ్ చెయ్యబోతున్నారు తెలిపారు. ఈ క్వారంటైన్ టైములో కొత్త కొత్త మ్యూజిక్ విధానాలు నేర్చుకుంటున్నాను అని, ఆయా మ్యూజిక్ పరికరాలకు ఎలా వాడాలో తెలుసుకున్నాను అని తెలిపారు.

కాగా ఇలాంటి సమయాల్లో తమ ప్రాణాలు సైతం ప్రమాదంలో ఉన్నాయని తెలిసినా తమ భాధ్యతను నిర్వహిస్తున్న పారిసిధ్య కారికులకు, వైద్యులకు, పోలీసులకు తానూ చేతులెత్తి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాని తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss