Thursday, December 2, 2021

Latest Posts

దేవినేని ఉమా కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

Devineni Uma convoy was stopped by the police

కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో అక్రమ మైనింగ్ జరుగుతోందని టీడీపీ శ్రేణులతో కలసి దీన్ని పరిశీలించేందు వెళ్ళిన మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో బెయిల్ దొరకడంతో రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలై భారీ కాన్వాయ్‌తో విజయవాడకు వస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు.

ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోకి రాగానే పోలీసులు రోడ్కు అడ్డంగా లారీలు, ట్రక్కులు పెట్టి దేవినేని ఉమా, టిడిపి నేతలు, కార్యకర్తలు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను నిలిపివేశారు. కాన్వాయ్‌ మొత్తం పంపిచందం కుదరదని దేవినేని ఉమా ప్రయాణిస్తున్న ఒక్క కారును మాత్రమే పపిస్తామని చేపడంతో ఉమా, పట్టాభి, మరియు ఇతర నేతలు అక్కడే నిరసనకు దిగారు. దీంతో భీమడోలులో స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో భీమడోలు రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss