Did George Bush ever mention Corona?
చైనాలో పుట్టిన కరోనా విస్తరించి మహమ్మారిగా ఎన్నో దేశాలను చుట్టేస్తోంది. అన్ని దేశాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. ఇక స్పెయిన్, ఇటలీ లను చూస్తే, పదివేల మరణాలు మొట్టమొదట చోటుచేసుకొన్న యూరప్ దేశా లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ లెక్కలనూ అమెరికాలో కరోనా విలయం దాటేస్తోంది. యూర్‌పలోని ఏ దేశంలోనూ ఒకే రోజు మరణాలు వెయ్యి దాటలేదు. కానీ, అమెరికాలో దాదాపు రెండు వేలమంది చొప్పున వరుసగా రెండురోజులు చనిపోవడంతో అక్కడ మరణాలు 17వేలు దాటేశాయి. స్పెయిన్‌ను మించిన విషాదం అమెరికాలో అలుముకొంది. అందులోనూ న్యూయార్క్‌లో శవాలు గుట్టలు పడుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారు అప్పుడే చెప్పారని, ఓ బాలుడు ముందే హెచ్చరించాడని.. ఇలా అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ పదిహేనేళ్ల క్రితమే కరోనా లాంటి మహమ్మారి గురించి హెచ్చరించారు. ఓ మహమ్మారిని ఎదుర్కోవడానికి అమెరికా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అవును 2005లో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జార్జి బుష్ మాట్లాడుతూ.. ‘‘అంటువ్యాధి(మహమ్మారి) కార్చిచ్చు లాంటిది. ఎంత త్వరగా నియంత్రిస్తే అంత తక్కువ నష్టం. లేకపోతే నష్టం ఊహకు కూడా అందదు’’ అని చెప్పారు. అప్పుడు ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారిని బుష్ అప్పుడే ఊహించారని అంటున్నారు.