Sunday, June 13, 2021

Latest Posts

నాగబాబు కి దిమ్మతిరిగిందా …

  తెలుగు  బుల్లితెర  చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో గత ఏడేళ్లుగా టిఆర్పి రేటింగ్ తో
 కామెడీ  షో గా ‘జబర్ధస్త్’ పేరుపొందింది. నిజానికి   ఈ షో మాములుగా ప్రసారమయ్యే సమయంలో ఎంత మంది చూస్తారో, యూట్యూబ్‌లో అంతకు రెట్టింపు సంఖ్యలో చూసే అభిమానులున్నారు. ఇక  ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందరూ  ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. ఇక  ఈ షోతోనే మెగా బ్రదర్ నాగబాబుకు మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.

   అంతవరకూ బానే ఉంది. కానీ ఇటీవల  జబర్ధస్త్ కామెడీ షో నిర్వాహకులు మల్లెమాల వాళ్లతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా నాగబాబు జడర్దస్త్ షో నుంచి బయటకు వచ్చి,  పోటీగా జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షోను ప్రారంభించారు. ఈ షోతో జబర్ధస్త్ కామెడీ పని అయిపోయిందన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ షో కోసం నాగబాబు తనతో  పాటు మరికొంత మంది జబర్ధస్త్ కంటెస్టెంట్స్ ని  తీసుకు వెళ్లారు. ఇక ఈ ప్రోగ్రామ్ ప్రసారమయ్యే సరికి, ప్రేక్షకులు ఈ  షో చూసి జబర్ధస్త్‌కు జిరాక్స్ కాపీ అని సోషల్ మీడియాలో ట్రోల్స్ వేస్తున్నారు.

   ఇటీవల టీఆర్పీ రేటింగులు చూస్తే,  జబర్ధస్త్‌కు 5 నుండి 6 రేటింగ్స్ వచ్చాయి.  ‘అదిరింది’కి మాత్రం కేవలం 0.5 రేటింగ్ రావడంతో అందరూ షాకయ్యారు. ఈ పరిస్థితి చూస్తుంటే గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో  నాగబాబు నిర్మించిన అట్టర్ ఫ్లాప్ సినిమా ‘ఆరెంజ్’ మాదిరిగా ఈ షో కూడా ఆయనను కోలుకునివ్వలేదని  కొందరు నెటిజన్లు   ట్రోల్స్ వేస్తున్నారు. వాస్తవానికి జబర్దస్త్ నుండి నాగబాబు బయటకు వచ్చాక,  ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని చాలా మంది భావించారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కు వస్తున్న భారీ రేటింగ్స్  చూస్తుంటే, ఆ షోలో మంచి స్కిట్స్ ప్రదర్శిస్తున్న పార్టిసిపెంట్స్ కు ఉన్న ఆదరణే కారణమని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss