Monday, July 26, 2021

Latest Posts

నన్ను సస్పెండ్ చేశావా జగన్ – ఆర్‌ఆర్‌ఆర్

Did YS Jagan Suspend RRR

వై.ఎస్. జగన్ మరియు ఎంపీ రఘురామ కృష్ణరాజు మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ ని అరెస్ట్ చేసిన వైసిపి ప్రభుత్వం ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు గా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వైసిపి యొక్క అధికారిక వెబ్‌సైట్‌లోని ఎంపీల జాబితా నుండి రఘురామ కృష్ణరాజు పేరు లేకపోవడమే.

ఇదే విషయం పై స్పందించాడు ఆర్‌ఆర్‌ఆర్. జగన్ నన్ను ఎం‌పీ గా సస్పెండ్ చేశావా అని. నాకు ఈ  విషయం పై స్పష్టత కావాలని ఆయన తెలిపాడు. ఈ విషయం పై 48 గంటల్లోగా స్పందించాలని అతను కోరాడు. జగన్ 48 గంటల్లో స్పందించకపోతే, తనను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించాలని లోక్ సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.

కొన్ని రోజుల క్రితం వైసిపి ఎంపి మార్గని భరత్ రామ్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకుని, వైసిపి పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నందున ఆర్ఆర్ఆర్ ను ఎంపిగా సస్పెండ్ చేయాలని కోరారు. మరి ఇది ఎంత వరకు దారి తీస్తుందో, ఆర్ఆర్ఆర్ లేఖ పై జగన్ లేదా అతని పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss