Pandya Brothers Playing Table Tennis:
లాక్డౌన్ నేపద్యం లో క్రికెట్ రద్దవటం తో ఆటగాళ్లు అందరూ ఇళ్లలోనే ఉంటూ.. వాళ్ళకి నచ్చిన పని చేస్తూ గడిపేస్తున్నారు. అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే వుంటుండగా… క్రికెట్ ప్లేయర్లు మాత్రం అప్పుడప్పుడూ వినూత్న రీతిలో ఆటలు కూడా ఆడుకుంటున్నారు. ఇక మైదానంలో ఎప్పుడూ జోష్ మీద ఉండే టీంఇండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇంట్లో సరి కొత్త పద్ధతిలో టేబుల్ టెన్నిస్ ఆడి చూపించారు.
#PandyaBros in action in a different sport 😏 @hardikpandya7 and I are always competitive with each other 🤪 Who do you think won this round? pic.twitter.com/4jjlatV15P
— Krunal Pandya (@krunalpandya24) April 23, 2020
పాండ్యా బ్రదర్స్ తమ బెడ్రూంలో టేబుల్ టెన్నిస్ ఆడుతున్న వీడియోను కృనాల్ గురువారం పోస్ట్ చేయటం జరిగింది. ఈ వీడియో లో బెడ్‌కు ఇరువైపులా హార్ధిక్, కృనాల్ పాండ్యాలు నిలబడి టేబుల్ టెన్నిస్ ఆడారు. అయితే ఇక్కడ మధ్యలో బెడ్‌షీట్ ను నెట్ లాగ ఉపయోగించారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లైన పాండ్యా బ్రదర్స్.. ఇద్దరూ బెడ్‌కు చెరో వైపు నిలబడి టెన్నిస్ బాల్‌తో చేతుల సాయంతో టేబుల్ టెన్నిస్ ఆడగా… ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి: సచిన్ టెండూల్కర్ @ 47..!!
కృనాల్ పాండ్యా ఈ వీడియోనూ షేర్ చేస్తూ…’మేము ఈరోజు సరికొత్త టేబుల్ టెన్నిస్ ఆడాం. బెడ్‌షీట్‌ను నెట్‌గా మార్చుకొని చేతులనే బ్యాట్‌గా భావించి ఆడాం. మీకు తెలుసుగా.. నా తమ్ముడు ఉంటే ఇలాంటి చిలిపి ఆలోచనలే వస్తాయి. ఇది కూడా వాడి ప్లానే.. అయితే గేమ్‌ను మాత్రం కాంపిటేటివ్‌గానే ఆడాం. ఈ రౌండ్లో ఎవరు గెలుస్తారో మీరే చెప్పండి అంటూ’ క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన నేటిజన్లు టేబుల్ టెన్నిస్ ని ఇలా కూడా ఆడతారా… అంటూ కామెంట్లు పెడుతున్నారు.