హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు కూలీలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. పిల్లలతో కలిసి వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ వారు పడుతున్న బాధలు చూసి పోలీసులు కూడా చలించిపోతున్నారు. కడప నుంచి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లేందుకు తమ పసి పిల్లలను ఓ కుటుంబం డోలిలో కూర్చోబెట్టి వెళ్తోంది. కాగా మరో ఘటనలో నడిచీనడిచీ అలసిపోయిన తన కుమారుడిని సూట్‌కేసుపై పడుకోబెట్టిన ఓ తల్లి ఆ వీల్సూట్కేసును తోసుకుంటూ ముందుకు కదులుతూ కొన్ని కిలోమీటర్లు నడిచింది. వారు పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్నారు.
ఇది కూడా చదవండి: వలస కూలీల నడక ప్రయాణం ఇక ఆగదా?