digvijay singh bother about the unknown mobile calls
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పలు సంచలనాలకు కూడా కేంద్ర బిందువు అవుతూ వస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేసారు. తనకు పదేపదే వస్తున్న అవాంఛనీయ ఫోన్‌కాల్స్ వల్ల ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసేశానని వెల్లడించారు. ఈ విషయాన్ని ఇప్పటికే మధ్యప్రదేశ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
‘‘గత నాలుగైదు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మధ్యప్రదేశ్ డీజీపీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లా. సర్వీసు ప్రోవైడర్లతో వ్యక్తిగతంగా కూడా చర్చించా. అయినా సరే, కాల్స్ రావడం ఆగడం లేదు. దీంతో ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసేశా’’ అని డిగ్గీ రాజా తెలిపారు. వస్తున్న ఫోన్‌కాల్స్ స్ర్కీన్‌షాట్ కూడా తీశానని, అందులో కొన్ని అంతర్జాతీయ నెంబర్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే దీనిపై అధికార బీజేపీ స్పందించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామేశ్వర శర్మ మాట్లాడుతూ… దిగ్విజయ్ సింగ్ భయపడాల్సిన అవసరం లేదని, స్విచ్చాఫ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన కాల్స్‌ని తన ఫోన్‌కు డైవర్ట్ చేయాలని రామేశ్వర శర్మ సూచించారు.