Home సినిమా వార్తలు కరోనా పోరాటంలో దిల్ రాజు సాయం

కరోనా పోరాటంలో దిల్ రాజు సాయం

Dil Raju assisted 10 Lakhs in the fight of Corona

Dil Raju assisted 10 Lakhs in the fight of Coronavirus

కరోనా మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్నాయి. ఈ చ‌ర్య‌ల‌కు ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ వంతు మ‌ద్దతు తెలియ‌జేస్తున్నారు. అంతే కాకుండా విరాళాల‌ను అందించారు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటించారు.

ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ ఎడ్రెస్ గా మారిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ త‌ర‌పున దిల్‌రాజు, శిరీష్ తెలంగాణ‌కు రూ.10 ల‌క్ష‌లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.10 ల‌క్ష‌లు విరాళాన్ని అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన నిర్మాత‌ దిల్‌రాజు ముఖ్య‌మంత్రి స‌హాయనిధికి ప్ర‌క‌టించిన‌ రూ.10 ల‌క్ష‌ల చెక్‌ను అందించారు.

కాగా  కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ భారీ విరాళం ప్రకటించాడు. ఏకంగా రూ.25 కోట్ల ఆర్థిక సహాయం చేసి తన భార్యను సైతం ఆశ్చర్యపరిచాడు. తాజాగా అక్షయ్ మరోసారి భారీ విరాళం ప్రకటించాడు. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించాడు. మున్సిపల్‌ కార్మికులకు అవసరమైన పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ), ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసం అక్షయ్ అందించిన ఈ విరాళం గురించి  ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు.

Exit mobile version