Friday, June 25, 2021

Latest Posts

దిల్ రాజు ఇలా చేస్తే మొదటికే మోసం వస్తుంది

Dil Raju Vakeel Saab Fake News

“వకీల్ సాబ్” విడుదలైన వెంటనే, ఈ చిత్రం రెండు లేదా మూడు వారాల్లో ఓటిటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతుందని వార్తలు హల్చల్ చేశాయి. థియేటర్లలోని కలెక్షన్లను ఈ వార్తలు ప్రభావితం చేస్తాయని చిత్ర బృందం భయపడింది మరియు వెంటనే ఆ వార్తలను ఖండిస్తూ దిల్ రాజు స్టేట్మెంట్ ఇచ్చారు.

దిల్ రాజు ‘వకీల్ సాబ్’ ఓటీటీలోకి ఇప్పుడిప్పుడే రాదన్నాడు. థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీ రిలీజ్ అంటూ ప్రచారం చేశారు. తీరా కట్ చేస్తే 20 రోజుల్లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఇప్పుడు, ఈ చిత్రం థియేటర్ విడుదలైన మూడు వారాల్లోనే ఏప్రిల్ 30 న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.

దీనితో మొదట్లో వార్తలు హల్చల్ చేసిన వారి దగ్గర సమాచారం ఉందని అవేమీ తప్పు కాదని అంటున్నారు. అయితే దిల్ రాజు ఇలా చేయడానికి కారణం కరోనా సెకండ్ వేవ్ అని అందుకే ఇలా విడుదల చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా ఇలా సినిమా విడుదల అయిన రెండు మూడు వారాల్లోనే ఓటిటిలో రిలీజ్ చేస్తే థియేటర్స్ మనుగడ దెబ్బ తింటుందని సినిమా ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.

ఇంతకు ముందు విడుదల అయిన విజయ్ మాస్టర్ కూడా కేవలం 20 రోజుల్లోనే ఓటిటిలో రిలీజ్ చేశారు. ఇలా ఎక్కువ డబ్బులు వస్తాయిని త్వరగా రిలీజ్ చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని థియేటర్స్ కి ముందు ముందు ఎవ్వరూ రారని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss