Friday, January 22, 2021

Latest Posts

ఎఫ్ 3పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన అనిల్

Director anil ravipudi gives clarity on his next movie

గడిచిన సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసిన యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పేసాడు. కరోనాతో లాక్ డౌన్ లో ఉన్నందున ప్రస్తుతం తన సొంత జిల్లా అయిన ప్రకాశం జిల్లాలోని తన స్వస్థలంలో తన రైటర్స్ టీంతో ఉన్నాడట. ప్రస్తుతం ఎఫ్ 3 కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. లాక్ డౌన్ పిరియడ్ ని బానే వినియోగించుకుంటున్నాడు.

అనీల్ రావిపూడి ఎఫ్ 3 కి సంబంధించిన మరిన్ని విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు, పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. ఈ చిత్రంలో వెంకటేష్ వరుణ్ తేజ్ తో పాటు తమన్నా మెహ్రీన్ లు కూడా నటించబోతున్నారు. ఈ నలుగురు ఖచ్చితంగా ఎఫ్ 3 లో ఉంటారని ధీమాగా చెప్పేసాడు. ఇక ఈ చిత్రంలో మూడవ హీరో గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటి వరకు రెడీ అయిన కథ ప్రకారం అయితే మూడవ హీరో అవసరం రాలేదు. సెకండ్ హాఫ్ లో ఏమైనా మరో హీరో అవసరం వస్తుందేమో చూడాలి’అంటూ కొంచెం సస్పెన్స్ పెట్టేసాడు.

ప్రస్తుతానికి మాకు కూడా మూడవ హీరో విషయంలో సస్పెన్స్ గానే ఉందని అనిల్ చెప్పుకొచ్చాడు. ఇక ఎఫ్ 2 చిత్రంతో పోల్చితే ఎఫ్ 3 చిత్రంలో మరింత ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని దర్శకుడు అనిల్ నమ్మకంగా చెప్పుకొచ్చాడు. ఎఫ్ 2 చిత్రం పెళ్లి నేపథ్యంలో తెరకెక్కింది. కాని ఎఫ్ 3 చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో సాగుతుందన్నాడు. మొత్తానికి ఎఫ్ 3 చిత్రం తన గత చిత్రాలతో పోల్చితే మరింత ఎంటర్ టైన్మెంట్ ను అందించే విధంగా ఉంటుందని అంటున్నాడు. మొత్తానికి లాక్ డౌన్ అయ్యాక ఈ మూవీ పట్టాలెక్కే సూచనలు కన్పిస్తున్నాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss