Monday, March 1, 2021

Latest Posts

ఉప్పెన సినిమాతో బంపర్ ఆఫర్ కొట్టిన బుచ్చి బాబు

Director Buchi Babu Got Bumper Offer
విమర్శకుల నుండి మిశ్రమ రివ్యూలు వచ్చిన్నప్పటికీ, “ఉప్పెన” బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. దీనితో ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ పండుగ చేసుకుంటుంది. ‘రంగస్థలం’ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వారికి ఇది మొదటి బ్లాక్ బస్టర్. వారి చివరి 6 చిత్రాలలో ఫ్లాప్స్ లేదా యావరేజ్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.

అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండి వారు ఈ చిత్రాన్ని ఫుల్ హైప్ చేస్తూ వచ్చారు. ఈ చిత్రం విజయంపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ .20 కోట్లు ఖర్చు పెట్టారు అది కూడా మొత్తం కొత్త వారిని నమ్ముకొని అంటే వారు ఈ సినిమా స్టోరీ మరియు దర్శకుడి పై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో మీకే అర్ధమవుతుంది. ఈ సినిమా ని సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వం వహించాడు.

మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు మరో రెండు చిత్రాలకు అదే దర్శకుడి కి అప్ప చెప్పింది. ఉప్పెన హీరో, హీరోయిన్ కొత్త వారే అయినప్పటికీ దర్శకుడు వారి నుంచి మంచి ప్రదర్శన రప్పించాడు.  ఇప్పుడు “ఉప్పెన” సక్సెస్ కావడంతో ఇప్పుడు బుచ్చి బాబుతో  రెండు సినిమాల ఒప్పందం చేయించుకుంది. మొత్తం మీద బుచ్చి బాబు కి బలే ఒప్పందం కుదిరింది అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss