Monday, July 26, 2021

Latest Posts

దర్శకుడు కొరటాల శివ సంచలన నిర్ణయం

Director Koratala Siva Quits Social Media

సోషల్ మీడియా అంటే పడని వారు చాలా మంది ఉంటారు. సోషల్ మీడియాలో ట్రాల్స్ చేసే వాళ్ళు విపరీతంగా ఉంటారు. దీనితో గత రెండు నెలల్లో, చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా నుండి తప్పుకున్నారు. తాజాగా ఇప్పుడు, టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు.

ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో తానే స్వయంగా వెల్లడించాడు. “నేను సోషల్ మీడియా నుండి దూరమవుతున్నాని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు ప్లేస్ ఉంది, కానీ నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. అయితే మీడియా స్నేహితుల ద్వారా నేను మీతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటాను. నేను కలుస్తూనే ఉంటాను. మాధ్యమం మారుతుంది కాని మన బంధం మారదు, ”అని కొరటాల శివ చెప్పుకొచ్చాడు.

ఇక సినిమాల పరంగా, కొరటాల మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం ‘ఆచార్య’ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తి కాగానే ఎన్‌టిఆర్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss