Sunday, June 20, 2021

Latest Posts

దర్శకుడు కేవీ ఆనంద్‌ ఇక లేరు

Tamil Director KV Anand Passed Away

తమిళ దర్శకుడు కేవీ ఆనంద్‌(54) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. కేవీ ఆనంద్‌ ఫొటో జర్నలిస్టుగా కెరీర్‌ ఆరంభించి తరువాత సినిమాటోగ్రాఫర్‌గా మారాడు. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా చేసిన మొదటి సినిమా ‘తెన్మావిన్‌ కోంబత్‌’కు జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు.

సుమారు పదేళ్ల పాటు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన కేవీ ఆనంద్‌ 2005లో ‘కన కందేన్‌’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తరువాత అయాన్‌, కో, మాట్రాన్‌, అనేగన్‌, కవన్‌, కప్పాన్‌ సినిమాలకు సైతం డైరెక్షన్‌ చేశాడు. ఆయన తీసిన ‘రంగం’, ‘శివాజీ’, ‘బందోబస్త్‌’ వంటి సినిమాలు ఆయనకు తెలుగులో కూడా గుర్తింపును తెచ్చాయి.

ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘డైరెక్టర్‌ కేవీ ఆనంద్‌ ఇక లేరన్న వార్తతో నిద్ర లేచాను. అద్భుతమైన కెమెరామన్‌, గొప్ప దర్శకుడు, మంచి మనిషిని కోల్పోయాం. ఆయనను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాం.. ఆయన కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి’ అని టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss