Sunday, June 20, 2021

Latest Posts

బాలీవుడ్ మెగా స్టార్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా

Director RGV To Work Again With Bollywood Megastar Amitabh Bachchan

రామ్ గోపాల్ వర్మ, అమితాబ్ బచ్చన్ చాలా సంవత్సరాలుగా కలిసి పనిచేశారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నిషబ్ద్, రామ్ గోపాల్ వర్మ కి ఆగ్, సర్కార్, సర్కార్ 2, మరియు సర్కార్ 3 వంటి అనేక చిత్రాలకు కలిసి పనిచేశారు. వారి చివరి చిత్రం సర్కార్ 3, 2017 లో విడుదలైంది.

అయితే ఇప్పుడు తాజాగా వర్మ మరియు బచ్చన్ మరోసారి జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వర్మ చాలా కాలం నుండి అమితాబ్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నాడు. ఇటీవల, అతను దానిని బాలీవుడ్ మెగాస్టార్ కి వినిపించాడట. కథ విన్న అమితాబ్ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. లాక్ డౌన్ పూర్తి కాగానే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

ప్రస్తుతం, అమితాబ్ చేతిలో చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బ్రహ్మాస్త్ర, మే డే, గుడ్ బై వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వర్మ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ మరియు డేంజరస్ చిత్రాల విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss