Director sukumar announced bunny new movie title Pushpa
గంగోత్రి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ కాలంలోనే తన సత్తా చాటుకుని స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. పలు హిట్స్,సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి `అల వైకుంఠపురములో..` సినిమాతో ఘనవిజయం అందుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈమూవీ ఫాన్స్ కి బాగా నచ్చేసింది.
`రంగస్థలం` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. గతంలో ఆర్య వంటి సూపర్ హిట్ మూవీస్ అల్లు అర్జున్ కి సుక్కు అందించాడు. తాజాగా చేస్తున్న మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
బన్నీ జన్మదినోత్సవం సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్ బుధవారం బయటకు వచ్చింది. ఈ సినిమాకు `పుష్ప` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో పూర్తి గడ్డంతో, రఫ్ లుక్‌తో బన్నీ సరికొత్తగా ఉన్నాడు. చిత్తూరు జిల్లాలోని స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కూడా `రంగస్థలం` తరహాలోనే పీరియాడిక్ డ్రామాగా సుకుమార్ తెరకెక్కించబోతున్నాడు.