Monday, October 25, 2021

Latest Posts

తమిళ సూపర్ స్టార్ తో పాన్ ఇండియా సినిమా చేయనున్న తెలుగు దర్శకుడు

Director Vamshi Paidipally To Work With Tamil Superstar
దర్శకుడు వంశీ పైడిపల్లి చివరి చిత్రం మహర్షితో రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించనున్నారు. తన హీరోలను క్లాస్ గా ప్రదర్శించడంలో స్పెషలిస్ట్ అయిన ఈ దర్శకుడు తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ కు ఒక కథను వివరించాడట. ఈ కథ నచ్చడంతో విజయ్ ఈ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలనేది వంశీ పైడిపల్లి ఆలోచన. హీరో విజయ్ అయితే తెలుగులో కూడా మార్కెట్ ఉంది కనుక తనని ఒప్పించినట్లు తెలుస్తుంది. స్టార్‌ నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ కింద ఈ ప్రాజెక్టును నిర్మించన్నారు. నెల్సన్‌తో విజయ్ తన చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం సెట్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది.

ఇకపోతే విజయ్ కూడా తన చివరి చిత్రం మాస్టర్ తో మంచి విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిస్తే ఆ కాంబో ఇంకో రేంజ్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss