Thursday, May 13, 2021

Latest Posts

సూపర్ స్టార్ కి డైరెక్టర్స్ ఎందుకు దూరం అవుతున్నారు

directors moving away from the superstar maheshbabu:

డైరెక్టర్స్ పనుల్లో  కొందరు హీరోలు ఇన్వాల్వ్ మెంట్ అయిపోతారు. తెగ జోక్యం చేసుకంటారు. ఇలా  కథలో జోక్యం వల్లనే ఎక్కువగా ప్లాప్స్ వస్తున్నాయని పవన్ కళ్యాణ్ నుంచి విజయ్ దేవరకొండ వరకూ చూస్తే ఇండస్ట్రీలో వినిపించే మాట ఇది.  ఇక  కొందరు డైరెక్టర్స్ చెప్పింది చేసుకుంటూ పోతారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి డైరెక్టర్స్ చెప్పినట్లు చేస్తూ వెళ్ళిపోతాడని పేరుంది. కానీ ఈ మధ్య ఎందుకో  డైరెక్టర్స్ మహేష్ కి దూరం అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. ఎందరో డైరెక్టర్స్ ఉన్నప్పటికీ ఎవరితోనూ సఖ్యత లేకుండా పోతోందని, డైరెక్టర్స్ హీరోగా ముద్ర పడిన  మహేష్ ఇలా  దూరం అవుతున్నాడన్న గుసగుసలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్, బిజినెస్ మాన్ లాంటి కమర్షియల్ హిట్  ఇచ్చిన పూరి జగన్నాధ్ అయితే  మహేష్ తో జన గణ మన మూవీ చేయాలనీ చాలా ట్రై చేసాడు. అతడు చేసిన ప్రయత్నం ఎందుకో ఫలించడం లేదట. మొత్తానికి  ఎందుకో మహేష్ కి పూరి దూరం అయ్యాడు.  ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన అతడు మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే  ఖలేజా మూవీ థియేటర్ లో ఫెయిల్ అయినా, ఎందుకు ఇలా అయిందని అనిపిస్తుంది. మరి త్రివిక్రమ్ తో మళ్ళీ మహేష్ మూవీ రాలేదు. అభిప్రాయ బేధాలే ఇందుకు కారణమా అని అంటున్నారు.

ఇక  సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే మూవీ డిజాస్టర్ అయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీ పీడకలగానే ఉంటుంది. అయితే మహేష్ తో మరో  సినిమా చేయాలని భావించిన సుకుమార్ కి ఛాన్స్ పోయింది. నిజానికి  సెట్స్ మీదికి వెళ్ళడానికి రెడీ అయ్యి కూడా కేన్సిల్ కావడంతో సుకుమార్ వేరే ప్రాజెక్ట్ చేసుకున్నాడు. ఇక  మహర్షి మూవీతో వంశీ పైడిపల్లితో మహేష్ క్లోజ్ గానే ఉంటున్నాడు. అయితే అతడితో సినిమా కూడా లేకుండా పోయింది. అలాగే సరిలేరు నీకెవ్వరు కూడా ఆశించినంత విజయం దక్కనందున అనిల్ రావిపూడితో గ్యాప్ వచ్చిందట. ఇలా అయితే మహేష్ కెరీర్ కి ఇబ్బందేనని ఫిలిం నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss