Monday, April 19, 2021

Latest Posts

ఢిల్లీ ఉదంతంపై ముస్లిమ్స్ లో పెల్లుబికుతున్న అసంతృప్తి 

Dissatisfaction among Muslims over the Delhi Markaz incident:

మహమ్మారి కరోనా  కట్టడికి  భారత ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్ వలన కొంత  కఠినం ఉన్నప్పటీకి…భారత్ లో లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తోందనుకుంటున్న సమయంలో ఢిల్లీ ఉదంతం ఒక్కసారిగా దేశమంతా  ఉలిక్కిపడేలా చేసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కస్ మస్జిద్ లో జరిగిన సదస్సు కేంద్రంగా కరోనా కొందరికి వ్యాప్తి చెందడం కలవరపెడుతోంది. లాక్ డౌన్ కు ముందే ఈ సదస్సు జరిగిందని., సదస్సు ముగిసిన తర్వాత తమ ప్రాంతాలకు వెళ్లే వీలులేక మర్కస్ లో చిక్కుకుపోయామని వారు చెబుతున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉంటే…ఈ సదస్సు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సదస్సు నిర్వహించిన తబ్లిగి జమాత్ పై కొన్ని ముస్లిం వర్గాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. తబ్లిగి జమాత్ సభ్యుల తీరును – సదస్సు నిర్వహించిన వారి తీరును షియా – సున్ని ముస్లిం వర్గాల నాయకులు విమర్శిస్తున్నారు.

వాస్తవానికి సున్ని – షియా వర్గాలు రెండూ ముస్లింలకు చెందినవే. అయితే ఆ రెండింటి మధ్య వర్గపరమైన విభేదాలున్నాయి. ఢిల్లీ ఉదంతం నేపథ్యంలో సున్ని వర్గానికి చెందిన తబ్లిగ్ జమాత్ సభ్యుల తీరుపై సహజంగానే షియా వర్గ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో సున్ని వర్గానికి చెందిన కొందరు కూడా కరోనా సమయంలో సదస్సు నిర్వహించకపోయి ఉంటే బాగుండేదని అంటున్నారు.  ఆ సదస్సు వల్ల దేశం మొత్తం కరోనా వ్యాప్తి చెందేలా చేసిన తబ్లిగ్ జమాత్ ను నిషేధించాలని – అటువంటి వారికి కఠిన శిక్షలు విధించాలని యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చీఫ్ వసీం రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తబ్లిగ్ జమాత్ ఆ సదస్సు కు కారణమైనవారిపై చర్యలు తీసకోవాలని మౌలానా కల్బే జవాద్ అన్నారు. తాలిబన్ల తరహాలో తబ్లిగ్ జమాత్ క్షమించరాని పాపం చేసిందని అది  తీవ్రమైన క్రిమినల్ చర్య అని షియా నేత – కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. తబ్లిగ్ జమాత్ అతివాద సంస్థ అని – దేశ వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడినందున ఆ సంస్థపై నిషేధం విధించాలని యూపీ మంత్రి – షియా నేత – మొహ్సిన్ రాజా అన్నారు.

మర్కస్ లో జరిగిన సదస్సు వల్ల కరోనా వ్యాప్తి చెందడం దురదృష్టకర ఘటన అని – సున్ని నేత మౌలానా ఖాలిద్ రషీద్ ఫిరంగీ మహాలి అంటున్నారు.  ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఖాలిద్…ఈ ఘటన వల్ల చాలామంది ప్రాణాలు అపాయంలో పడ్డాయని,  బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న సమయంలో ఆ సదస్సు నిర్వహించకపోయి ఉంటే బాగుండేదని దేశంలోనే అతి పెద్ద ముస్తిం సంస్థ  జమాయత్ ఉలెమా ఎ హింద్ పేర్కొంది. ఈ ఘటనకు కారకులైనవారికి చట్టపరమైన శిక్ష విధించాలని మీడియా తీర్పు ఇవ్వకూడదని జమాయత్ ఉలెమా ఎ హింద్ జనరల్ సెక్రటరీ – రాజ్యసభ మాజీ ఎంపీ మౌలానా మహమూద్ మదాని అన్నారు.లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేశంలోని 10 లక్షల మసీదులను మూసివేశామని – కేవలం నాలుగైదు మసీదులు ఇలా తెరచి ఉంచడం వల్ల ముస్లింలంతా మాటలు పడాల్సి వస్తోందని కొందరు  పేర్కొన్నారు. ముస్లింలందరినీ  నిందించడంవల్ల ముస్లింలలో అభద్రతాభావం పెరిగిపోతోందని అన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss