distribution of ration from tomorrow in telangana
ప్రపంచన్నీ వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినవిషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఇచ్చినట్లు గానే రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మే1 వ తేదీ నుంచి ఉచిత బియ్యంను రాష్ట్రంలోని ప్రతి రేషన్ కార్డ్ లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.
ఏప్రిల్ నెలలో ఇచ్చినట్లే మళ్లీ ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామాజిక దూరాన్ని పాటిస్తూ టోకెన్లో ఇచ్చిన నిర్దేశిత సమయంలోనే రేషన్ తీసుకోవాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ రూరల్, మెదక్ జిల్లాల్లో ప్రతి కార్డుదారుడికి కిలో కందిపప్పును కూడా ఉచితంగా అధికారులు పంపిణీ చేయనున్నారు. అలాగే రూ.1500 ఆర్ధిక సహయాన్ని మే 2వ తేదీ నుంచి పౌరసరఫరాల శాఖ అర్హులకు బ్యాంకు ఖాతాల్లో జమచేయున్నట్లు తెలిపారు .