Thursday, February 25, 2021

Latest Posts

కరోనా ఎఫెక్ట్ :ప్రపంచంలో సురక్షిత దేశాలెంటో తెలుసా!

do you know the safest countries in the world by corona

మహమ్మారి  కరోనా వైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలు మారిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాన్స్‌ హాప్కిన్స్‌ వర్సిటీ వెలువరించిన సమాచారం ఆధారంగా ప్రస్తుతానికి అమెరికా అంత్యంత ప్రమాద స్థితిలో ఉంది.  అయితే భవిష్యత్తులో ప్రభుత్వాల నిర్ణయాలు, పనితీరును బట్టి ఈ ర్యాంకులు మారే అవకాశం లేకపోలేదని సంస్థ పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్క జర్మనీ, దక్షిణ కొరియా తప్ప మిగతా దేశాలేవీ కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న దాఖలాలు లేవు. అందుకే లండన్‌ కి  చెందిన డీప్‌ నాలెడ్జ్‌ గ్రూప్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అత్యంత సురక్షిత దేశాల్లో జర్మనీ రెండో స్థానం దక్కించుకుంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరు ఆధారంగా ప్రపంచ దేశాలకు ఈ సంస్థ ర్యాంకులను కేటాయించింది.

జర్మనీలోని ప్రజలు మిగతాదేశాల ప్రజలతో పోల్చుకుంటే ఆరోగ్యం, ఆర్థిక అంశాల్లో మెరుగైన స్థితిలో ఉన్నారని పేర్కొంది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ అంచనా ప్రకారం జర్మనీలో ఏప్రిల్‌ 14 నాటికి 1.3 లక్షల కేసులు నమోదైతే దాదాపు సగం మంది రోగులు పూర్తిగా కోలుకున్నారు. 3వేల పైచిలుకు మరణాలు నమోదయ్యాయి. సంక్షోభ సమయంలో జర్మనీ ప్రభుత్వం స్పందించిన తీరు మిగతా దేశాలకంటే చాలా మెరుగ్గా ఉందని తేలింది.  మొదట్లో ఎక్కువ కేసులు నమోదైనా కరోనా వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలిగింది. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న  ఇజ్రాయెల్‌ ఈ జాబితాలో మొదటి స్థానం. దేశ సరిహద్దులను మూసేయడంలో వేగంగా స్పందించడమే దీనికి కారణం.

స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, చైనా కూడా మెరుగ్గానే ఉన్నాయి. రోజూ వేలకొద్ది మరణాలతో అల్లాడుతున్న అమెరికా సురక్షిత నగరాల జాబితాలో 70వ స్థానానికి దిగజారిపోయింది.  కరోనా వ్యాప్తిని గమనించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, వైద్య సదుపాయాలను సిద్ధం చేయడం, మరిన్ని కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం, క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌, అత్యవసర సేవలను సమర్థంగా అందించడం తదితర అంశాల్లో వివిధ దేశాల పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలను  పరిగణనలోకి తీసుకుని తాజాగా  లెక్కలు కూడా తయారుచేస్తే మళ్ళీ మారతాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss