Does anyone know what Mr. Perfect Cinema actually is
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నిజానికి ఎవరికోసం చేశారో తెలిస్తే షాకవుతారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ సూపర్ హిట్ అని తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వాళ్ళు రిజిస్టర్డ్ చేయించారు. కిక్ మూవీ తర్వాత డైరెక్టర్ సురేంద్ర రెడ్డి ఓ సినిమా చేయాలనీ అనుకున్నాడు. అప్పటీకే ఖలేజా షూటింగ్ లో ఉన్న మహేష్ ని కల్సి ఓ డాన్ టైప్ సినిమా కథ చెప్పాడు.
అంతకుముందు సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసిన అతిధి మూవీ ప్లాప్ అయినప్పటికీ కథ,డైరెక్టర్ మీద నమ్మకంతో మహేష్ కొత్త సినిమా ఒకే చేసాడు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ తీసేది మేమే అని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ప్రకటించారు. అప్పటివరకూ ఎవరూ పెట్టని విధంగా 40కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీయాలని ప్లాన్ చేసారు. మహేష్ కి 2న్నరకోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. హీరోయిన్ గా కరిష్మా కపూర్ ని ఎంపిక చేసారు. ఖలేజా తర్వాత 2010లో షూటింగ్ ప్రారంభిస్తామని ఇటు మహేష్ నుంచి,అటు ప్రొడ్యూసర్స్ నుంచి కూడా ప్రకటనలు వచ్చాయి.
అయితే కొన్ని కారణాల వలన ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకు పోయారు. కనీసం ప్రీ ప్రొడక్షన్ కి కూడా డబ్బు లేకుండా పోయింది. దీంతో మహేష్ తాను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాడు. దీంతో సురేంద్ర రెడ్డి ఊసరవెల్లి మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో స్టార్ట్ చేసాడు. అదే సమయంలో దశరధ్ తో కలిసి ప్రభాస్ చేసే సినిమాకు మిస్టర్ పెర్ఫెక్ట్ అనుకున్నారు. అయితే టైటిల్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ దగ్గర ఉందని తెల్సి వాళ్లకు ప్రభాస్ ఫోన్ చేయడంతో ఒకే చేసారు. అలా ప్రభాస్ హీరోగా మిస్టర్ పెర్ఫెక్ట్ వచ్చింది.