Donald Trump sensational comments on coronavirus
అగ్రరాజ్యంలో కరోన తన ప్రతాపం చూపిస్తోంది. రెండు లక్షల 77 వేలమందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు, మరియు 7500 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల సమయంలో 1500మంది మృత్యువాత పడ్డారు. అన్నీ దేశాలు లాక్ డౌన్ లు అమలు చేస్తూంటే అమెరికా మాత్రం లాక్ డౌన్‌కు ససేమిరా అంటుంది. ఒక ప్రకటనలో లాక్ డౌన్‌ను అమెరికాలో అమలు చేసినట్లు ఐతే దేశ ఆర్దిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిపినట్టు సమాచారం.
ఈ పరిస్థితిలో ఆ దేశ అద్యక్షుడు డోనాలాడ్ ట్రంప్ దేశ ప్రజలకు కొన్ని సూచనలు జారీచేశారు. కరోనా వ్యాప్తిని నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. అతను మాత్రం మాస్కు ధరించనని తెలియజేశారు. అలా చెప్పడంతో ఆయనపై విమర్శలు వెళ్ళు విరుస్తున్నాయి.