కరోనా వైరస్ కట్టడి విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు.. డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి దిగిపోయే ముందు తన వైఖరిని మార్చుకుంటున్నారు. మహమ్మారి కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్ధిక వ్యవస్థను పునరుద్దించే ఉద్దీపన బిల్లు విషయంలో ట్రంప్ మంకుపట్టు వీడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఉద్దీపన బిల్లుపై ట్రంప్ సంతకం చేయడంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం తప్పింది. ట్రంప్ మొండితనం వీడటంతో భారీ సంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కింది.
వచ్చే శనివారంతో ఈ పథకాలకు గడువు ముగియనుండగా.. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అందరికీ ఊరట కలిగింది. కరోనా సృష్టించిన విలయంతో భారీగా నష్టపోయిన అమెరికన్లకు ఆర్థిక సహాయం అందించాలన్న ప్రతిపాదనతో 900 బిలియన్ డాలర్ల(సుమారు రూ.66.37 లక్షల కోట్లు) ప్యాకేజీతో కూడిన బిల్లును అమెరికా కాంగ్రెస్ గతంలోనే ఆమోదించింది. కానీ, అనూహ్యంగా ట్రంప్ దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు.
చిరు వ్యాపారులు, పౌరులకు 600 డాలర్ల(రూ.44వేలు) ఆర్థిక సహాయం సరిపోదని, దాన్ని రెండు వేల డాలర్ల(రూ.1.47లక్షలు)కు పెంచాలంటూ ఆచరణ సాధ్యంకాని సూచనలతో కొర్రీలు వేశారు. నెలలుగా ట్రంప్ ఈ బిల్లుపై తాత్సారం చేయడంతో ఆమోదంపై సందిగ్ధత నెలకుంది. ఎట్టేకేలకు ఆయన మొండివైఖరి వీడి బిల్లుకు ఆమోదం తెలిపారు.
ఇవి కూడా చదవండి: