Saturday, January 16, 2021

Latest Posts

ఫస్ట్ లుక్ పై క్లారిటీ ఎప్పుడిస్తారో

don’t clarity on chiranjivi acharya movie first look?

రాజకీయాలనుంచి సినిమా రంగానికి రీ ఎంట్రీ ఇచ్చాక ఇప్పటికే రెండు సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ మూవీ చేస్తున్నాడు. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఈ టైటిల్‌ను ఇటీవల ఓ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.

అయితే ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేయగా, ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. అయితే ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లుగా ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు చిత్రయూనిట్ ప్రకటించలేదు. ఉగాదికి ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ వదిలి టాలీవుడ్ అంతా సందడి సందడి చేశారు.

అది అయ్యాక రామ్ చరణ్ లుక్ రివీల్ చేస్తూ ఎన్టీఆర్ వాయిస్‌తో ఓ వీడియో విడుదల చేశారు. ఈ అప్‌డేట్స్‌తో కరోనా టైమ్‌లో కూడా టాలీవుడ్ కళకళలాడినట్లు కనిపించింది. దీనిని కంటిన్యూ చేసేలా శ్రీరామనవమికి చిరంజీవి ట్రీట్ ఉండబోతుందని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ‘ఆచార్య’ ఫస్ట్ లుక్‌కు సంబంధించి అధికారికంగా ఎటువంటి వార్తా బయటికి రాలేదు. ఇంతకీ ఫస్ట్ లుక్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss