Sunday, February 28, 2021

Latest Posts

ఆ పరిశ్రమల ప్రాంతాల్లో ఏడాదిపాటు కూరగాయలు, పండ్లు తినొద్దు 

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీక్‌ ప్రభావం మరో ఏడాది పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిశ్రమ పరిసరాల్లో పండే కూరగాయలు, పండ్లను సంవత్సరం
వరకు తినకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. పరిశ్రమ సమీపంలోని రహదారులు, ఇండ్లల్లో స్టైరిన్‌ అవశేషాలను నిపుణుల బృందం గుర్తించింది. ఒక ఇంట్లో ఏకంగా 1.7 పీపీఎం స్టైరిన్‌ను గుర్తించినట్లు తమ నివేదికలో పేర్కొన్నారు.

ఇక్కడి నివాసాలను పూర్తిగా శుభ్రపరిచిన తర్వాతనే తిరిగి వెళ్లాలని, స్టైరిన్‌ ప్రభావానికి గురైన వ్యక్తులు ఏడాదిపాటు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఈ బృందం సూచించింది. 5 గ్రామాల ప్రజలకు 3 కిలోమీటర్ల పరిధిలోని కూరగాయలు, పండ్లను వినియోగించకుండా చూసుకోవాలని, పశుగ్రాసాన్ని పశువులకు అందించ్చవద్దని, స్థానిక పాల ఉత్పత్తులను కూడా వినియోగించవద్దని సిఫారసు చేసింది. తాగేందుకు, వంటల కోసం బహిరంగ జలాలను కూడా వాడొద్దని నిపుణుల బృందం సూచించింది.

ఇది కూడా చదవండి: చైనా ఎఫెక్ట్….యాపిల్ చూపు భారత్ వైపు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss